Wednesday, October 28, 2026

వినాయక ఉత్సవాలపై పోలీసుల దిశానిర్దేశం

కోహెడ, సెప్టెంబరు 10 : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోహెడ ఎస్‌ఐ పుల్ల అభిలాష్‌ సూచించారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

డీజేలు, లౌడ్‌స్పీకర్లను అధిక శబ్దంతో వినియోగించి శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదన్నారు. నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు. భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ఉత్సవాలు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ పుల్ల అభిలాష్‌ కోరారు.

సమావేశంలో పోలీసు సిబ్బంది, వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular