Wednesday, October 28, 2026

హుస్నాబాద్‌లో ఎస్సై జాన్‌ విల్సన్‌ సేవలను స్మరించుకున్న ప్రముఖులు

హుస్నాబాద్‌, అక్టోబర్ 21, నేటిమాట న్యూస్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో స్వర్గీయ సీఐ యాదగిరి, ఎస్సై జాన్‌ విల్సన్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ ఎస్సై జాన్‌ విల్సన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దండి లక్ష్మి మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ ప్రాంతంలో ఎస్సైగా జాన్‌ విల్సన్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎస్సై పి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. జాన్‌ విల్సన్‌పై ప్రజలకు ఉన్న అభిమానం ఆయన పేరిట కొనసాగుతున్న చారిటబుల్‌ ట్రస్ట్‌, ఆటో స్టాండ్‌, ఇళ్లలో, దుకాణాల్లో ఏర్పాటు చేసిన చిత్రాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ ఛైర్మన్‌ బోయిని ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి దామెర పద్మారావు, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్‌, వైద్యం కిరణ్‌ ప్రసాద్‌, బొలిశెట్టి రాజు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, నాయకులు ఐలేని మల్లికార్జున్‌రెడ్డి, బొజ్జ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular