Saturday, October 17, 2026

హాస్టల్ భవనాలకు శంకుస్థాపన

-హాస్టల్ భవనానికి రూ.7.28 కోట్ల చొప్పున మొత్తం రూ.14.56 కోట్లతో నిర్మాణాలు

-రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఆగస్టు 31 నేటి మాట న్యూస్ : ; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల హాస్టల్ నూతన భవనాల నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఒక్కో హాస్టల్ భవనానికి రూ.7.28 కోట్ల చొప్పున మొత్తం రూ.14.56 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ను విద్యా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. త్వరలో కళాశాలకు రెండు బస్సులు అందుబాటులోకి రానున్నాయని, హాస్టల్‌లోనే లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉద్యోగాలతో బయటకు వెళ్లేలా కళాశాలను అభివృద్ధి చేస్తామని, తనను ఎమ్మెల్యేగా కాకుండా విద్యార్థులకు గార్డియన్‌గా భావించాలని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో మరిన్ని విద్యాసంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వీసీ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్, ప్రిన్సిపల్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular