హుస్నాబాద్ , సెప్టెంబరు 29, నేటి మాట న్యూస్ : హుస్నాబాద్ పట్టణంలోని ఓ మొబైల్ షాప్ ఎదుట జారవిడుచుకున్న రెండున్నర తులాల బంగారు నల్లపూసల గొలుసును పోలీసులు కేవలం 14 గంటల్లోనే గుర్తించి బాధితురాలికి అప్పగించారు.పట్టణానికి చెందిన బూట్ల కవిత బస్టాండ్ ఏరియాలోని కార్తీక మొబైల్ షాప్ నుంచి బయటకు వచ్చి ద్విచక్రవాహనం ఎక్కే క్రమంలో బంగారు నల్లపూసల గొలుసు ఉన్న నల్లరంగు పర్స్ రోడ్డుపై పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత పర్స్ పోయిన విషయాన్ని గుర్తించిన కవిత.. మొబైల్ షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. పర్స్‌ను కొందరు మహిళలు తీసుకున్నట్లు గుర్తించి స్థానిక ఎస్ఐ పి. లక్ష్మారెడ్డికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పర్స్‌ను తీసుకున్న మహిళలను గుర్తించారు. వారి నుంచి పర్స్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని రెండున్నర తులాల బంగారు నల్లపూసల గొలుసును బాధితురాలు కవితకు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ లక్ష్మారెడ్డి సమక్షంలో అప్పగించారు. వేగంగా స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి బంగారు గొలుసును తిరిగి అందించిన ఎస్ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుల్ సంజీవ్‌లకు బాధిత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించి మిఠాయిలు తినిపించారు.
సీసీ కెమెరాల ఆధారంగా పర్స్ గుర్తింపు.. పోలీసుల చొరవపై బాధితుల అభినందనలు
RELATED ARTICLES

