హుస్నాబాద్ టౌన్, సెప్టెంబరు 29, నేటి మాట న్యూస్ : సిద్దిపేట జిల్లాలో ఈ నెల 28న నిర్వహించిన అతీయ పటీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్షిప్–2026 పోటీల్లో హుస్నాబాద్కు చెందిన కేరళ ఇ/మీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన బి. శ్రీచరణ్ (9వ తరగతి), ఎం. లక్కీ నాయక్ (9వ తరగతి) ఫైనల్లో ప్రథమ స్థానం సాధించారు. వీరు అక్టోబర్ 11న జగిత్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైనట్లు పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్, ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్, సెక్రటరీ, కరస్పాండెంట్ అల్లే శైలేందర్, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు కేరళ స్కూల్ విద్యార్థుల ఎంపిక
RELATED ARTICLES

