హుస్నాబాద్ , ఆగస్టు 29, నేటిమాట న్యూస్ : సిద్హుదిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అదనంగా రూ.3 కోట్ల బడ్జెట్ను మంజూరు చేసిందని మున్సిపల్ కమిసినర్ టి. మల్లికార్జున్ తెలిపారు. ఈ నిధులతో చెరువు కట్ట సుందరీకరణ పనులను పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ఎల్లమ్మ చెరువు, గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం ఎల్లమ్మ చెరువును ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో హుస్నాబాద్లో పర్యాటక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.

