హుస్నాబాద్,ఆగస్టు 31 నేటిమాట న్యూస్ : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం మొత్తం మూడు వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయానికి రెండు, సిద్దిపేట సీపీ కార్యాలయానికి ఒక వినతి వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని అధికారులు సూచించారు.
ప్రజావాణికి మూడు వినతులు
RELATED ARTICLES

