Saturday, October 17, 2026

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

హుస్నాబాద్,ఆగస్టు 31 నేటిమాట న్యూస్ : రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా కొత్త విద్యుత్ లైన్ స్ట్రింగింగ్ పనులు చేపడుతున్నందున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 1న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని TGSPDCL హుస్నాబాద్ టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు.
కరీంనగర్ రోడ్డు హాస్పిటల్ నుంచి సబ్‌స్టేషన్ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందన్నారు.
అలాగే మోడల్ స్కూల్, జీఆర్ రెడ్డి కాలనీ, గోమాత కాటన్ ప్రాంతం, నేతాజీ నగర్ నుంచి క్రషర్ ఏరియా వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. కొత్త లైన్ పనులు, మార్పిడి సమయంలో పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అయన తెలిపారు. వినియోగదారులు అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని TGSPDCL హుస్నాబాద్ టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular