హైదరాబాద్, ఆగస్టు 31, నేటిమాట న్యూస్ : రాష్ట్రంలో చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగియాల్సి ఉంది. అయితే పలువురు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడంతో గడువును పొడిగించినట్లు సమాచారం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల మంది చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
గడువు పొడిగింపుతో ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగింపు
RELATED ARTICLES

