Saturday, October 17, 2026

మండల క్రీడల్లో కట్కూర్ విద్యార్థుల సత్తా

కబడ్డీలో హ్యాట్రిక్.. వాలీబాల్‌లో ప్రథమ స్థానం

అక్కన్నపేట, సెప్టెంబర్ 08 నేటిమాట న్యూస్ : గౌరవెల్లి వేదికగా నిర్వహించిన మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో కట్కూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు సత్తా చాటారు. క్రీడా ప్రతిభతో పలు బహుమతులు సాధించి పాఠశాలకు, గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు. వాలీబాల్ సీనియర్ బాలుర విభాగంలో ప్రథమ బహుమతి, ఖోఖో సీనియర్ బాలికలు, జూనియర్ బాలికలు, జూనియర్ బాలుర విభాగాల్లో ద్వితీయ బహుమతులు సాధించారు. కబడ్డీ సీనియర్ బాలుర విభాగంలో వరుసగా మూడో ఏడాది ప్రథమ స్థానం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. విద్యార్థుల ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. రఘు, వ్యాయామ ఉపాధ్యాయుడు విజయ్ డేవిడ్ అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు ఆడెపు మహేందర్, తిప్పర్తి నాగేశ్వర్‌రావును అభినందించారు. గ్రామ సర్పంచ్ బాలరాజుతో పాటు గ్రామస్తులు, యువజన సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular