Saturday, October 17, 2026

ఇంటింటికీ మొక్కలు.. పచ్చదనమే లక్ష్యం

హుస్నాబాద్‌లో వన మహోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ

హుస్నాబాద్ సెప్టెంబర్ 08 నేటిమాట న్యూస్ : వన మహోత్సవంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని 5, 7వ వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించడం ద్వారా పట్టణంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చన్నారు.ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బొల్లిశెట్టి రాజు, కొండ రజిత, తిరుపతి, బొల్లి శ్రీనివాస్, బత్తుల స్వరూప, కో-ఆప్షన్ సభ్యుడు హసన్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా ఆర్‌పీలు, వార్డు ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular