Saturday, October 17, 2026

కేజీబీవీలో నీటి కష్టాలపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం

రోజూ 30 వేల లీటర్ల నీరు.. భోజన వేళల్లో నిర్లక్ష్యంపై విచారణ

అక్కన్నపేట, సెప్టెంబర్ 08 నేటిమాట న్యూస్ : అక్కన్నపేట కేజీబీవీలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆకస్మికంగా హాస్టల్‌ను తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.నీటి కొరత కారణంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆమె.. రోజూ 30 వేల లీటర్ల నీటిని హాస్టల్‌కు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇకపై నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థినులకు టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాలు నిర్ణీత సమయానికి అందడం లేదన్న ఫిర్యాదులపై కూడా ఆమె సీరియస్ అయ్యారు. త్రిసభ్య కమిటీతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అవసరమైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వంట సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించాలని సూచించారు. కేజీబీవీ ప్రహరీ గోడ నిర్మాణాన్ని రెండు రోజుల్లో ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular