Saturday, October 17, 2026

పరిశుభ్రతతోనే వ్యాధులకు చెక్

హుస్నాబాద్ సెప్టెంబర్ 08 నేటిమాట న్యూస్ : హుస్నాబాద్ పట్టణంలోని 7వ వార్డులో పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో ‘సఫాయి అప్నా భీమారీ భగావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు చెత్తను తడి, పొడిగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వార్డులో బ్లీచింగ్ చల్లడం, క్రిమిసంహారక మందుల పిచికారీ, డ్రైనేజీల శుభ్రత చేపట్టారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఎస్‌ఐ బాల ఎల్లం, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular