Saturday, October 17, 2026

420 హామీలు ఏమయ్యాయి? 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి

బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు.. కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టులపై నిరసన

చిగురుమామిడి, సెప్టెంబర్ 09 నేటిమాట న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను, ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌బాబు ఆదేశాల మేరకు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్‌రావులను అవమానించి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. వారిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామోజీ కృష్ణమాచారి, బెజ్జంకి రాంబాబు, సర్వర్ భాష, కత్తుల రమేష్, బుర్ర తిరుపతి, సన్నీల్ల మల్లేశం, మిట్టపల్లి మల్లేశం, మబుల్ పాషా, బెజ్జంకి లక్ష్మణ్, బోయిని శ్రీనివాస్, మల్లికార్జున్‌రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular