Saturday, October 17, 2026

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

బొలెరో వాహనం పట్టివేత.. నిందితుడిపై కేసు నమోదు

కోహెడ, సెప్టెంబర్ 09, నేటిమాట న్యూస్ : రామంచ గ్రామం నుంచి కోహెడ మీదుగా సిద్దిపేటకు బొలెరో వాహనంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తిని కోహెడ పోలీసులు పట్టుకున్నారు. కోహెడ గ్రామ శివారులో వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు బొలెరో వాహనం TG02-T-4931ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై నవాబ్‌పేటకు చెందిన *జెట్టి అజయ్ సాగర్ (28)*పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని ఎస్‌ఐ పి. అభిలాష్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular