హుస్నాబాద్, సెప్టెంబర్ 09, నేటిమాట న్యూస్ : వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 6వ, 14వ వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక సంఘ చైర్పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కల పెంపకంతో పట్టణంలో పచ్చదనం పెరగడంతో పాటు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వన మహోత్సవాన్ని కేవలం కార్యక్రమానికే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు కొండ రజిత, తిరుపతి, రాజు, సంపత్, రమేష్, బత్తుల స్వరూప, కోఆప్షన్ సభ్యుడు హసన్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా ఆర్పీలు, వార్డు ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

