Saturday, October 17, 2026

త్రికుటేశ్వరాలయంలో ఘనంగా నవగ్రహ ప్రతిష్ఠ

సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

హుస్నాబాద్, సెప్టెంబర్ 09, నేటిమాట న్యూస్ : హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామ త్రికుటేశ్వరాలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన, శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు చేపట్టారు. నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం శివలింగానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులు, గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా పాల్గొని నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోలురాజు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular