Saturday, October 17, 2026

పరికిబండలో క్రషర్ ఏర్పాటుపై గ్రామస్తుల ఆగ్రహం

హుస్నాబాద్, సెప్టెంబర్ 17, నేటిమాట న్యూస్ : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పరికిబండ గ్రామంలో క్రషర్ ఏర్పాటు చేస్తుండడం పట్ల గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి జీవనాధారంగా ఉన్న పరికిబండ ను తమకు తెలియకుండా ఓ క్రషర్ కంపెనీకి కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరికిబండ చుట్టూ కుంటలు ఏర్పాటు చేసుకొని ఆ నీటితో వ్యవసాయం, చేపల పెంపకం చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా క్రషర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారని వాపోయారు. క్రషర్ ఏర్పాటు చేస్తే తమ గ్రామంలో జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలు, ప్రజలు లేని చోట క్రషర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులందరూ మూకుమ్మడిగా క్రషర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తమ అనుమతి లేకుండా క్రషర్ ఏర్పాటు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. క్రషర్ ఏర్పాటు లో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. క్రషర్ ఏర్పాటుతో తమ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని గ్రామస్తులకు మద్దతుగా ఉండి క్రషర్ ఏర్పాటు చేయకుండా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular