Saturday, October 17, 2026

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం.. కుటుంబంలో విషాదం

హుస్నాబాద్, సెప్టెంబరు 18, నేటిమాట న్యూస్ : హుస్నాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన గూడ పద్మ భర్త మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె కుమారుడు గూడ నిఖిల్‌రెడ్డి స్థానిక TG మోడల్ స్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ కళాశాలలో చదివేందుకు డబ్బులు కావాలని తల్లిని కోరేవాడని, కుటుంబ పరిస్థితులను వివరించి ఆమె మందలించేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విసుగు చెందానని నిఖిల్‌రెడ్డి గతంలో పలుమార్లు చెప్పినట్లు తల్లి పోలీసులకు తెలిపింది. సెప్టెంబరు 16న ఉదయం 9.30 గంటల సమయంలో తల్లి గణేష్ మండపం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి నిఖిల్‌రెడ్డి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించింది.తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular