కోహెడ, సెప్టెంబరు 19, నేటిమాట న్యూస్ :విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సముద్రాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పేరాల సాయికుమార్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి ప్రశంసా పత్రంతో అభినందించారు.కోహెడ మండల విద్యా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సాయికుమార్ హిందీ ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలు, క్రమశిక్షణ, విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.
విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తూ, పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాయికుమార్కు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

