Saturday, October 17, 2026

కౌన్సిలర్‌కు తెలియకుండా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ..!

హుస్నాబాద్ రూరల్, సెప్టెంబర్ 19, నేటిమాట న్యూస్ :హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వ్యవహారం వివాదానికి దారితీసింది. స్థానిక కౌన్సిలర్ గాదపాక రవీందర్‌కు సమాచారం ఇవ్వకుండానే శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వడ్డెపల్లి రమణలుసీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారని కౌన్సిలర్ ఆరోపించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ అనేది ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం అందించే నిధులని, దానిని ఏదో ఒక పార్టీకి చెందిన కార్యక్రమంగా చూడటం సరికాదన్నారు. అయితే వార్డులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు స్థానిక కౌన్సిలర్‌కు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన వార్డు ప్రజాప్రతినిధికి తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు.

ఇదే వార్డులో ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా తనకు సమాచారం ఇవ్వకుండానే నిర్వహించారని రవీందర్ గుర్తు చేశారు. అప్పట్లోనే ప్రోటోకాల్ పాటించాలని కోరినా, తాజాగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలోనూ అదే విధానం కొనసాగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజల కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయాలకు తావు లేకుండా, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి. వార్డులో కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కౌన్సిలర్‌కు సమాచారం ఇవ్వడం కనీస బాధ్యత అని రవీందర్ పేర్కొన్నారు.వార్డులో ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని, ఇకనైనా అధికారులు, మున్సిపల్ పాలకవర్గం ప్రోటోకాల్ విషయంలో స్పష్టత పాటించాలని కోరారు. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ గాదపాక రవీందర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular