Saturday, October 17, 2026

స్వచ్ఛతకు ప్రజల భాగస్వామ్యం అవసరం

16వ వార్డులో ‘స్వచ్ఛత హి సేవ–2026’ కార్యక్రమం

హుస్నాబాద్, సెప్టెంబర్ 21, నేటిమాట న్యూస్ : పట్టణ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి అన్నారు. ‘స్వచ్ఛత హి సేవ–2026’లో భాగంగా CTU (Cleanliness Target Unit) కింద 16వ వార్డులోని BSNL ఆఫీస్ రోడ్డులో శనివారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది కలిసి డ్రైనేజీల ఇరువైపులా పెరిగిన గడ్డి, చెత్తను తొలగించారు.చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ.. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, సెప్టిక్ ట్యాంకులను ప్రతి మూడేళ్లకోసారి శుభ్రం చేయించుకోవాలని కోరారు. మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించి స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు పిల్లి తిరుపతి, బొలిశెట్టి రాజు, మంజుల, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, జవాన్లు సారయ్య, శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular