Saturday, October 17, 2026

గౌరవెల్లి డిస్ట్రిబ్యూటరీ కాల్వల భూసేకరణ వేగవంతం

రైతులతో సమన్వయం చేసుకుని ప్రక్రియ పూర్తి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట, సెప్టెంబర్ 21, నేటిమాట న్యూస్ : గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గౌరవెల్లి డిస్ట్రిబ్యూటరీ కాల్వల భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. కాల్వల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ఇప్పటికే చేపట్టినందున భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.రైతులతో సమన్వయం చేసుకుని భూసేకరణ పూర్తయ్యేలా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సేకరించిన భూమిలో కాల్వల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ పెండింగ్ భూసేకరణను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కె. హేమావతి మాట్లాడుతూ గౌరవెల్లి డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన పెండింగ్ భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular