హుస్నాబాద్, సెప్టెంబర్ 23, నేటిమాట న్యూస్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ, అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల రవాణా సమస్యను పరిష్కరించేందుకు త్వరలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
విద్యార్థుల సమస్యలపై మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ
RELATED ARTICLES

