హుస్నాబాద్, సెప్టెంబర్ 23, నేటిమాట: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు గణేష్ మండపాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి: మంత్రి పొన్నం
RELATED ARTICLES

