Saturday, October 17, 2026

మహాలింగేశ్వర స్వామి ఆలయానికి రూ.45 వేల విలువైన ఇత్తడి చెమ్మలు

పందిల్లలో భక్తురాలి సేవాభావం…

హుస్నాబాద్ రూరల్, సెప్టెంబరు 23, నేటిమాట న్యూస్ :హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా అమెరికాలో నివసిస్తున్న శ్రీమతి వారణాసి కావ్య రమేష్ దంపతులు ఆలయంలో దీపారాధన కోసం రెండు జతల ఇత్తడి చెమ్మలను బుధవారం బహుకరించారు.సుమారు రూ.45 వేల విలువైన ఈ ఇత్తడి చెమ్మలను బుర్ర గణేష్ మిత్రుల ద్వారా ఆలయానికి అందజేశారు. గతంలో కూడా కావ్య రమేష్ కుటుంబం స్వామివారి ఆలయానికి రూ.10,116 విరాళంగా అందించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కావ్య రమేష్ కుటుంబ సభ్యులు, వారి కుమారులు రోహిత్, రితిక్‌లకు శ్రీ మహాలింగేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, వారు అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular