Saturday, October 17, 2026

16వ వార్డులో రూ.20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

హుస్నాబాద్ రూరల్, సెప్టెంబర్ 23, నేటిమాట న్యూస్: హుస్నాబాద్ పట్టణంలోని 16వ వార్డులో హెల్త్ సబ్ సెంటర్ నూతన భవన నిర్మాణానికి బుధవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భూమిపూజ చేశారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనం పూర్తయితే స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని తెలిపారు. స్థానికంగా హెల్త్ సబ్ సెంటర్ భవనం అందుబాటులోకి రావడం ద్వారా 16వ వార్డుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. భూమిపూజ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular