Saturday, October 17, 2026

కూచనపల్లిలో వికసిత్‌ గ్రామపంచాయతీ ప్లానింగ్‌ ప్రక్రియ

విలేజ్‌ మ్యాప్‌ ద్వారా అభివృద్ధి పనులపై అవగాహన

హుస్నాబాద్‌ రూరల్, సెప్టెంబరు 23, నేటిమాట న్యూస్ :హుస్నాబాద్‌ మండలం కూచనపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్‌ మడప పద్మ, పాలకవర్గం ఆధ్వర్యంలో వికసిత్‌ గ్రామపంచాయతీ ప్లానింగ్‌ ప్రాసెస్‌ (విజిపిపి)లో భాగంగా విలేజ్‌ మ్యాప్‌ రూపొందించి అభివృద్ధి పనులపై వివరించారు. ఇప్పటివరకు గ్రామంలో చేపట్టిన పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మ్యాప్‌ ద్వారా అధికారులు గ్రామస్థులకు వివరించారు.ఈ సందర్భంగా ఏపీఓ పద్మ, ఈసీ పరశురాములు మాట్లాడుతూ విజిపిపిలో భాగంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన 375 పనుల వివరాలను మ్యాప్‌ ద్వారా సమగ్రంగా వివరించారు. గ్రామంలో ఇప్పటికే పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు విజిపిపి ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజమ్మ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మడప యాదవ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్‌ సత్యం, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular