ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి
హుస్నాబాద్ , సెప్టెంబర్ 22, నేటిమాట న్యూస్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ హైస్కూల్లో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామివారికి మంగళవారం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి గారికి ఆల్ఫోర్స్ విద్యార్థులు కోలాట ప్రదర్శనలు, భక్తిగీతాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీ వినాయక స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావాలను అలవర్చుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేసిన *“Vegggi fiesta”*ను డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు ప్రారంభించారు. చిన్నారులు వివిధ రకాల కూరగాయలతో రూపొందించిన ఆకర్షణీయమైన ప్రదర్శనలను ఆయన ఆసక్తిగా తిలకించి, విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. చిన్నారుల సృజనాత్మకతను అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆవరణలో భక్తి, ఉత్సాహం మరియు సందడి నింపింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

