హుస్నాబాద్ , సెప్టెంబరు 25, నేటిమాట న్యూస్ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ఆకర్షణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయక మండపంలో లడ్డూ, కలశం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ, కలశానికి రికార్డు ధర పలికిందని మండప నిర్వాహకులు తెలిపారు. లడ్డూను గ్రామానికి చెందిన సుంకరి సతీష్ రూ.1,05,016కు దక్కించుకున్నారు. అలాగే కలశాన్ని సుంకరి అజయ్ రూ.1,09,116కు వేలంలో కైవసం చేసుకున్నారు. సముద్రాల గ్రామంలో ఇన్నేళ్లుగా నిర్వహిస్తున్న లడ్డూ, కలశం వేలంలో ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి అని ఆకర్షణ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు పూల శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా నిర్వహించిన లడ్డూ లక్కీ డ్రాలో టోకెన్ నంబర్ 59కు చెందిన పొన్నాల చైత్ర విజేతగా నిలిచారు.
ఆకర్షణ యూత్ అసోసియేషన్ లడ్డూ, కలశం వేలంలో రికార్డు ధర
RELATED ARTICLES

