రూ.70 వేల విలువైన పశువు మృత్యువాత.. రైతును ఆదుకోవాలని వేడుకోలు
హుస్నాబాద్ రూరల్/ కోహెడ, సెప్టెంబర్ 25, నేటిమాట న్యూస్ : హుస్నాబాద్ నియోజకవర్గం లోనికోహెడ మండలం పోరెడిపల్లి గ్రామానికి చెందిన రైతు పాతూరి శ్రీనివాస్రెడ్డికి చెందిన దున్నపోతు పిడుగుపాటుకు మృతి చెందింది. గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన సమయంలో పిడుగు పడటంతో దున్నపోతు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతి చెందిన దున్నపోతు విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని రైతు తెలిపారు. పశువును కోల్పోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పశువుల నష్టానికి పరిహారం అందించి రైతును ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

