Sunday, October 18, 2026

ఆధునిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

హుస్నాబాద్ , సెప్టెంబరు 25, నేటిమాట న్యూస్ : ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని వినాయక మెడికల్ స్టోర్‌లో ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ కోర్సు పూర్తి చేసి ఫార్మసీ రంగంలో సేవలందిస్తున్న సభ్యులు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఫార్మసీ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫార్మసిస్టులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన హుస్నాబాద్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బింగి శ్రీనివాస్ ఫార్మసిస్ట్ సభ్యులను శాలువాలతో సత్కరించి, ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముంజ రమేష్, కోశాధికారి రావుల రంజిత్, నూక వంశీ, బింగి వెంకటరమణ, బండారి దినేష్, ఇజ్జగిరి శ్రీకాంత్, పడాల రామకృష్ణ, చిప్ప తిరుపతి, బండోజు వేణు, వెల్దండి వంశీబాబు, ఐత వర్ధన్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular