హుస్నాబాద్ టౌన్, సెప్టెంబరు 25, నేటిమాట న్యూస్ : జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన జిల్లా టూరిజం క్లబ్ పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్, అధ్యాపకులు శుక్రవారం కళాశాలలో విజేత విద్యార్థులను అభినందించి, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. హుస్నాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని చారిత్రక, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలపై విద్యార్థులు రూపొందించిన వీడియోలకు ఈ బహుమతి లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ విద్యా భారతి పిలుపు మేరకు వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఎస్. రాజు, ఎస్. సత్యనారాయణ, వి. సదాశివ్, వి. రజని, బి. ఎల్లయ్య, బి. వాల్య, ఎస్. వెంకట ముత్యం, సిహెచ్. విద్యాసాగర్, పి. చంద్రమోహన్, టి. రణధీర్ కుమార్, సిహెచ్. రాజిరెడ్డి, ఎస్. అశోక్, ఎం. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
జిల్లాస్థాయి టూరిజం క్లబ్ పోటీల్లో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు తృతీయ బహుమతి
RELATED ARTICLES

