హుస్నాబాద్, సెప్టెంబరు 28, నేటిమాట న్యూస్ : మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించి వ్యసన రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సోమవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు కలిసి “వ్యసనాలకు దూరం.. వికాసానికి దగ్గర” అంటూ నశా ముక్త్ ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎస్. రాజు మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారిన పడిన వారిని నేరస్తులుగా చూడకుండా, వైద్యం, కౌన్సెలింగ్, పునరావాసం ద్వారా సాధారణ జీవితం వైపు తీసుకురావాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, నశా రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి తిరునహరి రణధీర్ కుమార్ తో పాటు తదితరులు ఉన్నారు.మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేసిన విద్యార్థినులు….ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, వాటి నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. లలిత మాట్లాడుతూ విద్యార్థినులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పట్టుదలతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై సమాజంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్, మాదకద్రవ్యాల నిర్మూలన కన్వీనర్ టి. నిర్మల దేవి మాట్లాడుతూ విద్యార్థినులు మాదకద్రవ్యాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డి. కర్ణాకర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనపై సమాజంలో అవగాహన కల్పించడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థినులు చురుకుగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు బి. లక్ష్మయ్య, ఏ. సంపత్, డి. రవీందర్, ఎస్. సదానందం, కే. స్వరూప, ఎస్. కవిత, జి. కవిత, ఆస్మా పిర్దోస్, ఓ. రాణి, జూనియర్ అసిస్టెంట్లు కే. గీతాంజలి, ఎస్. రాములు, రికార్డు అసిస్టెంట్ టి. రమాదేవి, విద్యార్థినులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

