హుస్నాబాద్ , సెప్టెంబరు 28, నేటిమాట న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్ కార్యక్రమాన్ని హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ స్కూల్ వర్కింగ్ స్టాఫ్గా ఎంపికైన తాడూరి జాహ్నవి, తాడూరి లక్ష్మీలను సర్పంచ్ అభినందించారు. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

