కోహెడ, సెప్టెంబర్ 28, నేటిమాట న్యూస్ : అక్రమ ఇసుక రవాణాపై కోహెడ పోలీసులు కొరడా ఝళిపించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పోరెడ్డిపల్లి గ్రామ శివారులోని మోయ తుమ్మెద వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు జాన్డీర్ ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని తేలింది. దీంతో రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కోహెడ పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాల డ్రైవర్లు చామంతుల తిరుపతి, ఈరల రఫిక్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదని కోహెడ ఎస్ఐ పి.అభిలాష్ హెచ్చరించారు.
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి.. రెండు ట్రాక్టర్లు స్వాధీనం
RELATED ARTICLES

